NZB: హైదరాబాద్ శివారులోని పోచారం ఐటీ కారిడార్లోని యమ్నంపేట వద్ద గోరక్షకుడిపై దాడిచేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్యాసమాజ్, గోరక్ష విభాగ్ తదితరులు పాల్గొన్నారు.