SS: పుట్టపర్తిలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ.. వినియోగదారులు మోసాలకు గురికాకుండా తూనికలు, కొలతల విభాగం తనిఖీలు చేపట్టాలని, ఆహార భద్రత, మందుల అధిక ధరలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు బిల్లు తప్పనిసరిగా ఇచ్చేలా అవగాహన కల్పించాలన్నారు.