ATP: తాడిపత్రి KGBV మైనారిటీ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. పదవ తరగతి విద్యార్థినులు సమీరా, సోఫియా, నర్సిన్లు ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ పద్మావతి తెలిపారు. ఈ విజయంపై ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. జాతీయ స్థాయి పోటీలో రాణించాలని ఆకాంక్షించారు.