KKD: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా పిఠాపురంలో నీట మునిగిన పలు ప్రాంతాలను ఇవాళ కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత ఆయన కరివేపాకుపేట 26 వార్డులో పర్యటించి నీట మునిగిన గృహాలను పరిశీలించారు. కాలనీల్లో వర్షపు నీరు బయటకు పంపేందుకు తక్షణం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.