AKP: రాంబిల్లిలో పీఏసీఎస్ ఛైర్మన్లతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రైతుల అభివృద్ధిపై సమీక్షించారు. రైతుల సమస్యలపై సంబంధిత వ్యవసాయ అధికారులతో ఎప్పటికప్పుడు ఛైర్మన్లు చర్చలు జరిపి వారికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. పంటల అధిక దిగుబడులకు సహకరించాలని తెలిపారు. ఉద్యానవన పంటలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.