MDCL: మేడ్చల్ PS పరిధిలోని కిష్టాపూర్లో కరెంట్ షాక్తో మల్లికార్జున్ రెడ్డి అనే ఎలక్ట్రిషియన్ మృతి చెందాడు. మల్లికార్జున్ రెడ్డి కిష్టాపూర్లోని ఫోమ్ ఎక్స్ సొల్యూషన్స్ కంపెనీలో విద్యుత్ దీపాన్ని అమర్చుతుండగా, షాక్కు గురై కింద పడిపోయాడు. తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.