KKD: జిల్లా కో- ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏజీఎం వేలిశెట్టి రమేష్ జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ ఏజీఎం రమేష్తో మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాల్లో నూతనంగా నియమితులైన త్రిసభ్య సభ్యుల కమిటీతో కలిసి సొసైటీల అభివృద్ధికి సహకరించి రైతులకు సకాలంలో రుణాలు అందించాలన్నారు.