KDP:మైనర్లకు వాహనాలు ఇస్తే జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని పులివెందుల DSP మురళి నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని స్థానిక పూలంగళ్ళ సర్కిల్ వద్ద వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ద్విచక్ర వాహనదారుల లైసెన్సులు,వాహన పత్రాలను పరిశీలించారు. సరైన వాహన పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు.