కోనసీమ: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల పక్షపాతిగా పాలన సాగిస్తూ ఆపత్కాలంలో ఉన్న వారికి భరోసాగా నిలుస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఇవాళ రామచంద్రపురం టీడీపీ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన రూ. 17 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వ ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు.