VKB: తాండూర్ పట్టణంలోని మైనారిటీ గురుకుల, సోషల్ వెల్ఫేర్ గురుకులాలను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి పాఠశాల ప్రాంగణం, హాస్టల్ వసతి గృహాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల అభ్యాసనం, ఆహార వసతి, పాఠశాల సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.