GNTR: సామాజిక మాధ్యమాల ద్వారా అవాస్తవ ప్రచారాలు, ద్వేషపూరిత పోస్టులు, వీడియోలు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులతో ఇవాళ జూమ్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, విదేశాల్లో ఉన్న నిందితులపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయాలని సూచించారు.