RR: కొండాపూర్లోని రాఘవేంద్రకాలనీలో కబ్జాకు గురైన 2వేల గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా అధికారులు శుక్రవారం కాపాడారు. బై నంబర్లు సృష్టించి 10 ప్లాట్లుగా మార్చి కబ్జాకు ప్రయత్నించిన స్థలంలో ఆక్రమణలను తొలగించారు. కాలనీ అసోసియేషన్ ఫిర్యాదుతో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఆదేశాల మేరకు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేశారు.