ASR: ప్రభుత్వ భూములు జోలికొస్తే క్రిమినల్ కేసులు తప్పవని డుంబ్రిగూడ మండల తహసీల్దార్ త్రివేణి హెచ్చరించారు. చాపరాయి జలవిహారి ప్రాంతంలో కొందరు తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంతో ఆమె స్వయంగా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భూములను అనుమతి లేకుండా ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు.