KMM: ప్రతీ కాలనీ శుభ్రంగా ఉండేలా అధికారులు, సిబ్బంది క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, నగర శుభ్రతలో నిర్లక్ష్యం వహిస్తే సహించమని మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని 7వ డివిజన్ ఖానాపురంలో పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. డివిజన్లో పలు చోట్ల మురుగు నీరు నిల్వ ఉండడం, చెత్త పేరుకుపోవడం గమనించి సిబ్బందికి సూచనలు చేశారు.