ATP: జిల్లా ఎస్పీ పీ. జగదీష్ ఆదేశాలతో జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో “స్త్రీలు, పిల్లలను లైంగిక వేధింపుల నుంచి రక్షించడంలో విద్యార్థుల పాత్ర” అంశంపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీసు పిల్లలు, పలు విద్యాసంస్థల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.