TPT: తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ గణేష్పై అధికార పార్టీ నాయకుల దాడి సరికాదని ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజల సమస్యలు చర్చించాల్సిన కౌన్సిల్ సమావేశంలో పట్టపగలు గుండాయిజాన్ని ప్రోత్సహించడం ఏంటని ప్రశ్నించారు. ఈ దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.