MDK: గౌడ కులస్తులపై, గీత కార్మికులపై జరుగుతున్న ఎక్సైజ్ దాడులను వెంటనే నిలిపివేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సాగౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం చేగుంట మండలం, కర్నాలపల్లి వద్ద రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. గౌడ కులస్తుల హక్కుల కోసం మోకు దెబ్బ మరో పోరాటం చేయాలన్నారు.