KDP: మహిళ ఆచూకీ కోసం గత 3రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదని సిద్దవటం ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని డేగనవాండ్లపల్లికి చెందిన పెసల అమ్మనమ్మ 60 బుధవారం మధ్యాహ్నం అదృశ్యమవడంతో సమీపంలోని పెన్నానదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మాచుపల్లి, సిద్ధవటం పెన్నా పరివాహ ప్రాంతాల్లో గాలింపులు చేపట్టినా ఆచూకీ లభించలేదన్నారు.