PLD: తుఫాను ప్రభావంతో మాచవరం మండలంలో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పిల్లేరు, వాగుల వద్ద సిబ్బందిని మోహరించారు. వర్షం పడేటప్పుడు ప్రజలు బయటకు రావొద్దని, ఏదైనా సమస్య ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని శుక్రవారం తహశీల్దార్ నాగమల్లేశ్వరరావు సూచించారు.