AP: కర్నూలు బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. HYD నుంచి బస్సు బయలుదేరిన నేపథ్యంలో.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సుల వేగ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో త్వరలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక మంత్రుల సమావేశం నిర్వహిస్తామన్నారు.