BDK: ఇల్లందు మండలం కొమ్ముగూడెం గ్రామ పంచాయతీని ఆకస్మికంగా శుక్రవారం కొత్తగూడెం డీఎల్పీవో ప్రభాకర్ తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులతో పాటు రికార్డుల నిర్వహణ కూడా సక్రమంగా ఉండాలని వారు ఆదేశించారు. రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారితో పాటు ఎంపీవో చిరంజీవి, పంచాయతీ కార్యదర్శి మౌనిక ఉన్నారు.