PDPL: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి పాత్ర ప్రదర్శన (రోల్ ప్లే) పోటీల్లో గర్రెపల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు శ్రావ్య, సహస్ర, కార్తిక, ప్రణతి, హర్షిత విజేతలుగా నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా విద్యాధికారి డీ. మాధవి తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా. గోల్డి బల్బీర్ కౌర్, గైడ్ టీచర్లు మురళీధర్ విద్యార్థినులను అభినందించారు.