SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ఓపెన్ స్లాబ్‌లో ఇవాళ హుండీ లెక్కింపు జరుగుతున్నట్లు ఆలయ ఈవో రమాదేవీ తెలిపారు. కాగా, ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులతో పాటు ఆలయ సిబ్బంది, సేవాసమితి సభ్యులు పాల్గొంటున్నారు. పోలీస్, ఎస్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో నిర్వహిస్తున్నారు.