TG: నిరుద్యోగ బాకీ కార్డును మంత్రి హరీష్ రావు విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదని.. జాబ్‌లెస్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. రాహుల్, ప్రియాంకలతో మాయ మాటలు చెప్పించి.. ఇప్పుడు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల బదులు మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని దుయ్యబట్టారు.