PPM: కార్తీకమాసం సందర్భంగా పంచారామాలు, శైవ క్షేత్రాలకు సాలూరు డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో మేనేజర్ బీ.సూర్యనారాయణ మూర్తి తెలిపారు. ఈ మేరకు పంచారామాలు క్షేత్రాలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆయన కార్యాలయంలో విడుదల చేసారు. పంచారామాలు క్షేత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను కార్యాలయ పనిదినాలలో నేరుగా సంప్రదించాలని కోరారు.