VZM: జిందాల్ కంపెనీ నిర్మాణానికి గిరిజనుల నుంచి సేకరించిన భూములను ఇతరులకు అప్పగిస్తే సహించేది లేదని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ అన్నారు. తమకు న్యాయం చేయాలని ఎస్ కోట మండలం బొడ్డవరలో జిందాల్ భూ నిర్వాసితులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. గిరిజనుల భూములను వారికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.