KDP: ప్రభుత్వం ప్రవేశపెట్టిన శక్తి యాప్ మహిళల రక్షణ కోసమేనని SI శాంతమ్మ అన్నారు. శుక్రవారం కడప నగరంలో మహిళలకు శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ మేరకు మహిళలు ఆపదలో ఉంటే శక్తి యాప్ ద్వారా సమాచారం ఇస్తే పోలీస్ సిబ్బంది క్షణాల్లో వచ్చి చేరుతారని రక్షణగా ఉంటారని అన్నారు. అనంతరం ప్రతి మహిళా శక్తి యాప్‌ను తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.