SS: సోమందేపల్లి మండలం నడింపల్లి రహదారి అకాల వర్షాలకు కోతకు గురి కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో సమీపంలోని గ్రామాలకు వెళ్లడానికి ప్రజలు, పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.