VKB: కొడంగల్ మండలంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా పత్తి రైతులకు పీడ కలను మిగిల్చింది. భారీ వర్షంతో పత్తి తడిసిపోయింది. తడిసిన పత్తిని జిన్నింగ్ మిల్లు యాజమాన్యం కొనడం లేదని, పైగా తేమ ఎక్కువగా ఉందంటూ అధికారులు కొర్రీలు పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.