GNTR: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఆగష్టు 2025లో జరిగిన డిప్లమో ఇన్ జర్నలిజం ఫలితాలను ఇవాళ పరీక్షల అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. 56% విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. రీవాల్యుయేషన్, జవాబు పత్రాల నకలు కోసం విద్యార్థులు నవంబర్ 4లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒక్కో సబ్జెక్టుకు రీవాల్యుయేషన్ ఫీజు రూ.1,860 ఉంటుందని పేర్కొన్నారు.