RR: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ పంచాయతీ రాజ్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.