SS: లేపాక్షి మండలం పులమతి గ్రామ సచివాలయాన్ని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధికారిక పీఎస్ వీరయ్య పరిశీలించారు. సచివాలయంలో ఉద్యోగుల హాజరు, పనితీరు వివరాలను తెలుసుకొని, సమయపాలన పాటించాలని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, సిబ్బంది సమన్వయంతో పనులు పూర్తి చేయాలని కార్యదర్శి దుర్గయ్యకు ఆదేశాలు ఇచ్చారు.