కృష్ణా: చిన్నతుమ్మిడి గ్రామంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్సై గణేష్ కుమార్ శుక్రవారం దాడి చేశారు. ఏపీ గేమింగ్ యాక్ట్ 9(1) ప్రకారం జూదం ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.2750 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.