NGKL: జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్లో రేపు ఉదయం 10 గంటలకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్ శాఖ పనితీరు, విధి నిర్వహణ, సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.