NZB: ఆర్డీఆర్ విత్తనాలతో అధిక లాభాలు గడించవచ్చని రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బాల్కొండలో వరిపంట క్షేత్ర దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. మండల కేంద్రంలోని రైతు నర్సయ్య పొలంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.