KMR: జిల్లా SP ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శేఖర్ శుక్రవారం రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళకు రక్తం అత్యవసరం కాగా రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలు ద్వారా విషయం తెలుసుకున్న శేఖర్ రక్తదానం చేశారు. రక్తదాతలు మానవత్వానికి ప్రతీకలని ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎంతోమంది రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారన్నారు.