WGL: అభివృద్ధి రాజకీయాలకు అతీతమని, ప్రతి కాలనీలో సమస్యలు పరిష్కరిస్తామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 57వ, 59వ డివిజన్లలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్లు, డ్రైనేజీ, రిటైనింగ్ వాల్ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేసి వారు మాట్లాడారు. మేయర్ గుండు సుధారాణి తదితరులున్నారు.