KMM: కర్నూల్ జిల్లా బస్సు ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్ రోడ్డు ప్రమాదంలో మంటలు అంటుకొని పలువురు సజీవ దహనమైన విషయాన్ని తెలుసుకున్న భట్టి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.