VZM: రామభద్రపురం మండలం కొట్టక్కిలో ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయించిన భూములు ఎపీఐఐసీకి చెందినవేనని ఆర్డీవో జేవీఎస్ రామ్మోహన్ స్పష్టం చేశారు. కొట్టక్కి పంచాయతీలో ఎంఎస్ఎంఈ పార్కులో జరుగుతున్న పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. పనులను అడ్డుకోవడానికి వచ్చిన కాకర్లవలస గ్రామస్తులను వారించారు. ఈ భూమిని 2018 లోనే ఏపీఐఐసీకి కేటాయించడం జరిగిందనీ ఆర్డీవో తెలిపారు.