SRD: సిర్గాపూర్‌లోని 108 అంబులెన్స్ వాహనాన్ని జిల్లా ప్రోగ్రాం మేనేజర్ షాహిద్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వాహనంలో అత్యవసర వైద్య చికిత్సల సేవల కోసం సిద్ధంగా ఉంచిన మందులు, ఆక్సిజన్, బీపీ, షుగర్ తదితర చెకప్ పరికరాల ఉపయోగం పరిశీలించారు. సిర్గాపూర్ మండలానికి 108 వాహనం కేటాయించినప్పటి నుంచి ఎమర్జెన్సీ కేసుల విషయంలో EMT అరుణ్ సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.