BHPL: రైతులు పత్తిని దళారులకు అమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. ఇవాళ మంజూరునగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో పత్తి రైతు సూచనల గోడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కాపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసి, స్లాట్ బుక్ చేయాలని, ఆధార్ లింక్‌తో డబ్బులు ఖాతాలో జమవుతాయని తెలిపారు. 2025-26లో క్వింటాల్‌కు రూ.8110 మద్దతు ధర నిర్ణయమైందన్నారు.