PPM: ఐటీడీఏ పరిధిలో గల హడ్డుబంగి బాలికల ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న మండంగి. కవిత ఊపిరితిత్తుల సమస్యతో అనారోగ్యానికి గురైంది. విశాఖపట్నం కేజీహెచ్‌లో వైద్య సేవలు పొందుతూ.. శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థిని మృతి చెందిందని పాఠశాల సిబ్బంది తెలిపారు. తండ్రి మండంగి. బాలకృష్ణ, తల్లి చామంతికి వీరు ముగ్గురు పిల్లలు, ఒక పాప, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారని తెలిపారు.