MDK: హవేలీ ఘనాపూర్, మెదక్ మండలంలో మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని డీఈ పల్లవి తెలిపారు. జక్కన్నపేట ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్లో రెండు పంపులు చెడిపోవడంతో పంపింగ్ నిలిపివేసినట్లు తెలిపారు. హవేలీ ఘనపురం మండలంలో 32 గ్రామాలు, మెదక్ మండలంలో రెండు గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోతుందని వివరించారు.