SKLM: కొత్తూరు మండలం కార్లెమ్మ పంచాయతీ పరిధికి చెందిన బడగాం గ్రామం వద్ద రోడ్డుపై ఎండబెట్టిన 15 క్వింటాల జొన్న గింజలను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ఎత్తుకెళ్లారని రైతు పెద్ద కోట ఆనందరావు వాపోయారు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. నాలుగు ఎకరాల్లో పండించిన జొన్న పంట దొంగల పాలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.