MBNR: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దేవుని గుట్టపై నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సతీసమేతంగా శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అంతకుముందు ఆయనకు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు.