MNCL: జన్నారం మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన బొంతల మధుకర్ వ్యవసాయ అంశంలో పీహెచ్డీ పట్టా సాధించారు. పంటపై వివిధ నీటిపారుదల పద్ధతులు, డ్రోన్‌తో మందుల పిచికారి, కలుపు నియంత్రణ, తదితర అంశాలపై ఆయన పరిశోధన చేశారు. శుక్రవారం యూనివర్సిటీలో ప్రొఫెసర్ డాక్టర్ వి.రాములు చేతుల మీదగా బొంతల మధుకర్ పీహెచ్డీ పట్టాను అందుకున్నారు. దీంతో మధుకర్‌ను అందరూ అభినందించారు.