SKLM: మందస మండలం హరిపురం గ్రామంలో గాయత్రి చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ కోస్టల్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలాస ఎమ్మెల్యే శిరీష హాజరై, శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.