CTR: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటన దిగ్భ్రాంతి కరమని ఎమ్మెల్యే జగన్ మోహన్ చెప్పారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు శుక్రవారం వేకువజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతి కావడంతో పలువురు మరణించడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.