‘కాంతార ఛాప్టర్-1’పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ‘ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు నేను ఒక ట్రాన్స్‌లో ఉన్నా. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా వన్ మ్యాన్ షో చేసినందుకు రిషబ్ శెట్టికి అభినందనలు. నిజాయితీగా చెప్పాలంటే.. కాంతార అనుభవాన్ని వివరించడానికి మాటలు సరిపోవడం లేదు’ అంటూ పోస్ట్ పెట్టారు.