చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మూవీ ‘కొత్తలోక’. ప్రముఖ OTT వేదిక జియో హాట్‌స్టార్‌లో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, మరాఠి భాషల్లో అందుబాటులో ఉండనుంది. మరోవైపు నటుడు విజయ రామరాజు నటించిన ‘అర్జున్ చక్రవర్తి’ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.